హైదరాబాద్ లోని మాసబ్ టాంక్ ప్రాంతంలో చేతబడి ఆనవాళ్లు కనపడ్డాయి. నడిరోడ్డుపై తల లేని దూడ మొండెం, పుసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో పూజ చేసినట్లుగా గుర్తులు ఉన్నవి. అది చూసిన జనం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదివారం స్థానిక పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.