బాలాపూర్ RCI రోడ్ లోని శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం, 10. 30 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం అశేష భక్తజనం మధ్య కోలాహాలంగా జరిగింది. తర్వాత అన్నప్రాసద వితరణ లో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం కార్తీక దీపోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ తిరుపతి, సెక్రటరీ వెంకట సత్యనారాయణ తెలిపారు.