బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కొత్తపేట పాత గ్రామం ఎస్సీ బస్తీకి చెందిన సుక్క కుమార్ ఏడు సంవత్సరాల కుమారుడు వారి భవనం పై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు భవనం ప్రక్కగా వెళ్తున్న విద్యుత్ తీగలను తాకి గాయపడ్డ విషయాన్ని తెలుసుకుని, వారి నివాసం వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, గాయపడ్డ బాబును పరామర్శించిన ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వజీర్, ప్రకాష్ గౌడ్. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి భవనానికి దూరంగా మరొక విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ తీగలను మార్చాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో జాతీయ గౌడ సంఘాల జేఏసీ ముఖ్య సలహాదారులు ముద్ద గోని రామ్మోహన్ గౌడ్, కొత్తపేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము బాబు, నాయకులు చావ సత్య, నాగ దుర్గ ప్రసాద్, నరహరి తదితరులు పాల్గొన్నారు .