రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి జెడ్పిహెచ్ఎస్ లో 1997-98లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఓ ఫామ్ హౌస్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించారు. వారంతా ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, నాటి ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.