అంబర్ పేట్: హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్యాష్ పిటీషన్
హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గురువారం క్యాష్ పిటీషన్ దాఖలు చేశారు. తనను రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు నిబంధనలు పాటించలేదని, అరెస్ట్ సమయంలో కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, సంబంధం లేకపోయినా కేసులో ఇరికించారని పిటీషన్ లో పేర్కొన్నారు.