మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. వాహనాల రద్దీ దృష్ట్యా.. రాబోయే రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ యాత్రికులకు సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్‌లో చెక్ చేసుకుని.. రద్దీ లేకుంటే ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ట్రాఫిక్ ఉంటే అనువైన ప్రదేశంలో వేచి ఉండాలన్నారు.