‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్‌నైట్‌లోనే నటి పాయల్ రాజ్‌పుత్ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నప్పటికీ.. సినిమాల ఎంపిక విషయంలో వెనకబడ్డారు. ఆమె నటించిన చాలా వరకు సినిమాలు హిట్ అందుకోలేకపోయాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత టాలీవుడ్లో నన్ను కొంత మంది తప్పుదోవ పట్టించారు. ఆ సినిమా విజయంతో నేను హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాను. అప్పుడు కొందరు దర్శకులు అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నించారు. వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడుతున్నాను.’ అని అన్నారు.