TG: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి దశ ఎన్నికలు 24న, రెండవ దశ ఎన్నికలు మార్చి 3న, మూడవ దశ ఎన్నికలు మార్చి10న జరుగనున్నాయని తెలుస్తోంది. అలాగే పదవ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.