నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు బుధవారం ఎంపీ ధర్మపురి అరవీంద్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. దీపావళి పండుగను ప్రజలు తమ ఇళ్లను దీపాలతో అలంకరించి ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సందర్భంగా టపాసులను కాల్చే సమయంలో పిల్లలను ఒక కంట కనిపెడుతూ.. పెద్దల సమక్షంలోనే టపాసులు కాల్చే విధంగా చూడాలని పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.