నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం పోలీస్ శాఖ డైరెక్టర్ జనరల్(డీజీ) అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సిబ్బందిని పెంచాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డీజీని కోరారు.