నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపడతాం అని ఇందిరమ్మ కమిటీలతో నిజమైన అర్హులైన గరిబోళ్ళని మోసం చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ళ జాబితా ప్రజాక్షేత్రంలో నిర్ణయించాలని లేని పక్షంలో అర్హులందరితో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని హెచ్చరించారు.