13 ఎలక్ట్రానిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చేసాయి. నిజామాబాద్ రీజినల్ కు మొత్తం 64 బస్సులు రానుండగా, మొదటి విడతగా 13 ఎలక్ట్రానిక్ బస్సులు డిపోకు చేరుకున్నాయి. బస్ స్టాండ్ లో శుక్రవారం 13 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధనుపాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డిలతో కలిసి ఆయన బస్సులో ప్రయాణించారు.