సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నవీపేట్ మండల చైర్మన్ గా రాకేష్ ను ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ సాప పండరి శుక్రవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల, మానవ హక్కులతో పాటు భూ కబ్జాలు, బడుగు బలహీన వర్గాలకు విద్య ఉపాధి, సామాజిక న్యాయం కోసం కృషి చేసేందుకు చైర్మన్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం నియామక పత్రం, ఐడి కార్డును అందజేశారు.