రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి గురువారం సాయంత్రం రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమెకు ఎంపీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అతని వెంట బిజెపి నాయకులు ఉన్నారు.