కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ లోని కళాశాలలో ఇంటర్నేషనల యోగ డే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ అయినటువంటి డాక్టర్ ఆర్ స్వామి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఇన్చార్జ్ డాక్టర్ సమ్రీన్, ప్రశాంతి, ముఖ్య అతిథిగా నేచురల్ క్యూర్ హాస్పిటల్ ప్రకృతి చికిత్సాలయం డాక్టర్ యోగా సాయిలు మరియు కళాశాలలోన అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగ సాయిలు కొన్ని ఆసనాలు కొన్ని సూర్య నమస్కారాలు మరియు యోగాలో ఉండే కొన్ని చిట్కాలు అవి చేసే వ్యాధులు నివారణ గురించి చాలా సవివరంగా వివరించడం జరిగింది. కళాశాల విద్యార్థులకు మరియు అధ్యాపకులు ఇతర సిబ్బందికి అందరికీ యోగా గురించి కొన్ని వీడియోలు చూపించడం జరిగింది.