చందూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో బుధవారం అనిమియా భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఐదు, ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు హిమోగ్లోబిన్ మరియు హెల్త్ చెకప్ లను చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అసన్ అలీ, వసంత, సునీత వైష్ణవి, ఆశావర్కర్లు శ్యామల, వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.