బోధన్ మండలం అందాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పిల్లలతో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్య కుమార్ మాట్లాడుతూ పిల్లల్లో సజాత్మకతను వెలికి తీయడానికి వారిలో శారీరక మానసిక ఉల్లాసానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, విజయలక్ష్మి, శ్రీనివాస్, కళ్యాణి, సంఘమని, రామ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.