రైతులకు బోనస్ ఇవ్వడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ సాలురా మండల కేంద్రంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రవి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, రైతు రుణమాఫీపై, సన్నాలకు 500 రూపాయల బోనస్ పై విపక్షాలు చేస్తున్న బోగస్ ప్రచారాన్ని రైతులు నమ్మద్దని ఆయన సూచించారు.