ఆహార మరియు సాంకేతిక కళాశాల రుద్రూర్ లోని బాపురెడ్డి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటగా ఇన్చార్జ్ అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అమల బాపు రెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన త్యాగాల గురించి పిల్లలకు వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన హైదరాబాదులోని బాలికల కోసం 26 పాఠశాలలను స్థాపించడం జరిగింది. విద్యార్థులు వారి వారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పడం జరిగింది.