బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో రేపు శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. శుక్రవారం సుదర్శన్ నగర్ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ బిల్డింగులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆల్ ఇండియా బంజారా భవన్ ఫౌండేషన్ హాల్ కు భూమి పూజ చేసి తర్వాత 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.