కమ్మర్ పల్లి మండలంలోని కోన సముద్రంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అభివృద్ధి పనుల కోసం వేసిన శిలా ఫలాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.