నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నాడు సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీని చక్కబెట్టకుండా చిలక జోస్యం చెబుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు.