కమ్మర్పల్లి మండలానికి చెందిన సౌందర్య గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన ఆమెకు ఎవరు లేరని తెలుసుకున్న బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెను వెంటనే స్పందించి హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తము రూ. 2. 50 లక్షల ఎల్ఓసిని ఆదివారం బాల్కొండలో అందజేశారు.