భీంగల్. మండల కేంద్రంలో మంగళవారం రోజు సహస్ర ఫంక్షన్ హాల్ లో మండలానికి చెందిన 224 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ భగత్ కౌన్సిలర్లు , తహశీల్దార్ తదితరులు హాజరయ్యారు.