రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వేలో ఆదివాసి నాయకపోడ్ సంఘ సభ్యులు సహకరించాలని మంగళవారం ఆదివాసి నాయక్ పొడ్ ఉద్యోగుల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ సూచించారు. మంగళవారం మోర్తాడ్ మండలంలోని దొన్ కల్ గ్రామంలో నాయకపోడ్ సంఘం సభ్యులతో ఆయన మాట్లాడారు. సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు నాయక్ పోడ్ సంఘం సభ్యులు ఎస్టీ అని రాయించాలని వారికి సూచించారు.