ఆర్మూర్ పట్టణంలో సోమవారం కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ఆక్రమించిన షెడ్లను సీఐ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. గతంలో కూడా ఫుట్ పాత్ పై షెడ్లు ఏర్పడంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. తిరిగి మళ్లీ అదే సమస్య ఉండడంతో తొలగించారు. దీంతో వ్యాపారులు మండిపడుతున్నారు.