డొంకేశ్వర్ మండలంలోని తొండకూర్ ఉన్నత పాఠశాలలో పోతుల గణేష్ ఎస్ఏ (సోషల్) గా విధులు నిర్వహించి అక్టోబర్ 31వ తేదీన పదవీ విరమణ పొందిన సందర్భంగా పాఠశాల ఆవరణలో గురువారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వన్నెల్ (కే) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని పీఆర్టీయు మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లింగారెడ్డి, ఎంఈవోలు రామకృష్ణ, అవధూత గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.