ఆర్మూర్ పట్టణం లోని బీసీ హాస్టల్లో భోజనం సక్రమంగా పెట్టడం లేదని హాస్టల్ విద్యార్థులు, తల్లిదండ్రులు నిజామాబాద్ కలెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. వార్డెన్ సమయపాలన పాటించడం లేదని వారు ఆరోపించారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ వార్డెన్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పిల్లలతో పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.