ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కాలేజ్ సమీపం లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కాలనీలో వోల్టేజ్ సమస్య ఉందని స్థానికులు లైన్మెన్ సంతోష్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. లైన్మెన్ ఉన్నత అధికారులకు లోపల సమస్య గురించి వివరించారు. దీంతో అధికారులు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ వర్క్ తొలగించి 160 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.