నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తిన విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్లి నీటి ఉధృతిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున పరిసర జిఎన్ఆర్ కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. వారి వెంట డిఎస్పి గంగారెడ్డి తదితరులున్నారు.