పెంబి మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఖానాపూర్ అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి సంచారం దృష్ట్యా మంగళవారం పట్టణ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద అటవీశాఖ అధికారులు మైకు ద్వారా ప్రచారం చేశారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా రాత్రివేళ తిరగవద్దని, అడవిలోకి వెళ్ళవద్దని తెలిపారు.