పెంబి మండలంలో లంబాడి పోరాట హక్కుల సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. లంబాడీ జేఏసీ సోమవారం చలో లగచర్లకు పిలుపునిచ్చింది. దీంతో ఆ సంఘం నాయకులు లగచర్లకు వెళ్లకుండా పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. లంబాడా పోరాట హక్కుల సమితి మండల అధ్యక్షుడు కన్సోత్ విలాస్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం బెదిరింపు ధోరణి మానుకోవాలన్నారు. ఇందులో విక్రమ నాయక్, రాంసింగ్ నాయక్, దశరథ్, తదితరులు ఉన్నారు.