సైడ్ డ్రైనేజీకి భూమి పూజ

63பார்த்தது
సైడ్ డ్రైనేజీకి భూమి పూజ
ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ గ్రామంలో సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి ఆ మండల వైస్ ఎంపీపీ డి. బాలాజీ భూమి పూజ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆ గ్రామంలో ఎన్ఆర్ ఈజీఎస్ రూ. 10 లక్షల నిధులతో చేపట్టిన సైడ్ డ్రైనేజ్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం వైస్ ఎంపీపీ డి. బాలాజీ మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி