ఖానాపూర్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

62பார்த்தது
ఖానాపూర్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొజ్జు కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ, కన్నాపూర్ పరిసరాలలో పులి సంచరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, గుంపులు గుంపులుగా వెళ్లాలని ఆయన కోరారు. పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி