కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలను శుక్రవారం అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందని వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 106 క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరగా ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు 94 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 174 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వారు వెల్లడించారు.