రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని అన్నారు. మంగళవారం కడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో 8, 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసిన గత ప్రభుత్వం కుటుంబ పాలన సాగించిందని ఆరోపించారు.