జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి అటవీ రేంజ్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకొని ఇంధన్ పల్లి అటవీ రేంజ్ కు తరలించినట్లు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిలో ఉన్న వాగులలో నుంచి ఇసుక తరలిస్తే అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.