కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జన్నారం ఇన్ ఛార్జ్ ఎఫ్ ఆర్ ఓ సుష్మారావు అన్నారు. శుక్రవారం జన్నారం మండలం బాదంపళ్లి గ్రామానికి చెందిన జాడి రాజన్న అనే వ్యక్తి అక్రమంగా కలప రవాణా చేస్తుండగా పట్టుకొని జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి ముందు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టైగర్ రిజర్వ్ అటవీ చట్టం ప్రకారం అక్రమ కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.