వరకట్న వేధింపులతో ఈ నెల 8న దస్తురాబాద్ మండలం రేవోజిపేటకు చెందిన సంద లత (23) ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారకులైన నిందితులు ఆమె భర్త సంద నాగరాజు, అత్తమామలు సత్తవ్వ, వెంకటిలను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. సోమవారం నిర్మల్ డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇందులో దస్తూరాబాద్ ఎస్ఐ శంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.