ఈనెల 23 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో నిర్వహించే నేతకాని ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు అన్నారు. శుక్రవారం ఉదయం దండేపల్లి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి నేతకాని కులస్తుడు విధిగా తప్పకుండా ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. నేతకాని కులంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించాల్సిన అవసరం ఉందన్నారు.