స్వచ్ఛ సౌచాలయ్-స్వచ్ఛ సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 నుండి డిసెంబర్ 10 వరకు గ్రామాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ విషయమై మంగళవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ 20 రోజుల కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ శానిటేషన్ కింద కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతులు, పునరుద్ధరణ, వ్యక్తిగత టాయిలెట్లలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరిస్తారని తెలిపారు.