సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుకను ఎలాంటి జాప్యం లేకుండా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశంలో శాలిగౌరారం మండలం, వంగమర్తి ఇసుక రీచ్ నుండి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుకను ఇచ్చేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదం తెలిపింది.