ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ ఆర్టీసీ డిపో ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ ప్రజా పాలన అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీలో తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.