నల్గొండ నియోజకవర్గం, కనగల్ మండల పరిధిలోని బ్రిడ్జి వద్ద కాలిన స్థితిలో ఉన్న మృతదేహం ఆదివారం మధ్యహ్నం 4 గంటల సమయంలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వ్యక్తిని అక్కడే చంపి కాల్చారా లేదా పడేసి వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎక్కడ, ఎందుకు చంపారు అనే వివరాలు తెలియాల్సి వుంది.