తెలంగాణలో సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో కట్టంగూర్ మండలం మల్లారం గ్రామం నుండి 200 కుటుంబాలు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.