నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10: 00 గంటల నుండి 2: 00 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అన్నీ శాఖలకు సంబంధించి మొత్తం 3 దరఖాస్తులు రాగా అందులో 2 రెవెన్యూ, 1 పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినవి. వచ్చిన దరఖాస్తులు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని ఎంపీడీఓ ఎస్. పి. జయలక్ష్మి తెలియజేశారు.