అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందుంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా బుధవారం అయన నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పండించేందుకు అవకాశం ఉందన్నారు.