నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని జమ్మన కొండ తండాలో అక్రమంగా ఒకచోట నల్ల బెల్లం దాసి ఉంచారనే సమాచారంతో గురువారం హైదరాబాద్ కు చెందిన ఎస్టిఎఫ్ టీం లీడర్ ఎస్ఐ బాలరాజు సిబ్బందితో కలిసి బెల్లం దాసి ఉంచినటువంటి గోదాము పై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 300 కేజీల బెల్లం, 10 లీటర్ల నాటు సారా పట్టుబడింది. కృష్ణా నాయక్ అనే ఒక వ్యక్తి నాటు సారా తయారీ కోసం వినియోగించే నల్ల బెల్లాన్ని అమ్మకాల కోసం ఈ గోదాంలో దాచిపెట్టి ఉంచాడు.