నల్గొండ జిల్లా రామగిరిలో అక్షర హై స్కూల్ నందు మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగము, అక్రమ రవాణాపై మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో యువత మత్తు పదార్థాలు గంజాయి బారినపడి వారి యొక్క భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని, అదేవిధంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.