అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం మదారిగూడెం గ్రామంలో వర్షంతో నేలవాలిన పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.